
ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రధాని రాకకు పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రాధాన్యత కలిగింది. సుమారు 8వేల కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజలకు అందించే లక్ష్యంతో సాగుతుంది.
ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద 2,360 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ స్మార్ట్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇది పారిశ్రామిక రంగంలో తెలంగాణకు కొత్త దిశకు చూపించనుంది. 3175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూరు మహాబూబ్నగర్ జాతీయ రహదారి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1243 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులకు ప్రధాని జాతీకి అంకితం చేస్తారు.వరంగల్ జిల్లలో 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ టెక్స్ టైల్ పార్క్ తెలంగాణ చేనేత, వస్త్ర రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి సహయపడుతుంది.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణకు చేరుకోనున్నారు. ఆయన పర్యటన అత్యంత పకడ్బందీగా సాగేలా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. మధ్యాహ్నం 2.50 గంటలకు కర్ణాటక నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. హెలీకాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకొని అక్కడ 8000కోట్ల విలువై వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.10 నిమిషాలకు హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన సింధూ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్లో జామ్నగర్కు బయల్దేరారు.
ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
