💥💥💥💥*జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు*💥💥💥

1000388807


▪️ *మే 14, 21, 28, జూన్ 4, 11లలో అత్యవసర కేసులు విచారణ.*


*ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.*

జూన్ 15న పూర్తిస్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ఉత్తర్వులిచ్చారు.


*మొదటి దశలో మే 14, 21, 28 తేదీల్లో విచారణలు ఉంటాయి*  హైకోర్టు న్యాయ మూర్తులు డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు, జస్టిస్ మెడమల్లి బాలాజీ డివిజన్ బెంచ్, జస్టిస్ తుహిన్ కుమార్ సింగిల్ బెంచ్ విచారణ చేపడతారు.

*రెండో దశలో జూన్ 4, 11 తేదీల్లో విచారణలు జరగనున్నాయి.*

జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మ డివిజన్ బెంచ్, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్లో కేసులను విచారిస్తారు. మరోవైపు డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక న్యాయమూర్తులు సింగిల్ బెంచ్ విధులనూ నిర్వహిస్తారు.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *