
సనాతనధర్మాన్ని రక్షించడమంటే అసలు అర్థమేమిటి?
ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా?
కాదు. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని తాను ఆచరించి, ఇంకొకరి చేత ఆచరింపజేయడం వలన ధర్మం రక్షింపబడుతుంది.
వెనకటికాలంలో ఎంతోమంది ఎన్నోరకాల అనుష్ఠానాలు చేసేవారు.
తమ పిల్లలకు వేరే దేశాలకు పంపిస్తారో లేదో అనేది వేరే విషయం.
మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు.
మా పిల్లలు ధనవంతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు.
అయ్యో మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు? అని ఆలోచించేవారు.
ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది.
కాబట్టి చిన్ననాటినుండే రామాయణ, భారత, భాగవత పురాణ ఇతిహాసాదులన్నీ చెప్తుండే వారు.
దానితో వారి మనస్సులో అద్భుతమైన సంస్కారం ఏర్పడేది.
ఆ సంస్కారం చిన్నవయసులో కలిగితే, ఆ సంస్కారమే వారిచేత ధర్మాచరణ చేయిస్తుంది.
అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది.మన చేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకంలో, పరలోకంలోనే కాక తరువాతి జన్మలకు కూడా శ్రేయస్సును, సుఖాన్ని అనుగ్రహిస్తుంది.
ఈ విధమైన ఆచరణతోనే సనాతన ధర్మం రక్షింపబడుతుంది. అదే ధర్మో రక్షతి రక్షితః.—
జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.————————————-
