
స్త్రీ నిధి కన్సల్టెంట్ రిక్రూట్మెంట్ 2026 – 19 పోస్టులకు నోటిఫికేషన్
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (తెలంగాణ ప్రభుత్వం, గ్రామీణాభివృద్ధి శాఖ) హెడ్ ఆఫీస్, హైదరాబాద్లో 19 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాంట్రాక్ట్ బేసిస్పై ఒక సంవత్సరం పాటు (పనితీరు మేరకు వార్షిక పునరుద్ధరణ) ఉండే పదవులు. గమనించండి – ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, శాశ్వత ఉద్యోగం కాదు.💥💥💥
మొత్తం ఖాళీలు: 19
దరఖాస్తు చివరి తేదీ: 20-05-2026
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (పోస్ట్ ద్వారా లేదా ప్రత్యక్షంగా సమర్పించాలి)💥💥💥
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్ + వ్యక్తిగత ఇంటర్వ్యూ
ఉద్యోగ ప్రాంతం: హెడ్ ఆఫీస్, హైదరాబాద్ (తెలంగాణ)
పోస్టులు, జీతాలు (నెలకు):
జనరల్ మేనేజర్ – రూ. 2,00,000💥💥💥
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫండ్స్ & అకౌంట్స్) – రూ. 65,000💥💥💥
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటీ, ఎంఐఎస్ & ప్రొక్యూర్మెంట్) – రూ. 1,50,000💥💥💥
డిప్యూటీ జనరల్ మేనేజర్ (మానిటరింగ్) – రూ. 65,000
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఐటీ, ఎంఐఎస్ & ప్రొక్యూర్మెంట్) – రూ. 1,25,000💥💥💥
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ & ఫండ్స్) – రూ. 56,000💥💥💥
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ & అడ్మిన్) – రూ. 56,000💥💥💥
టీమ్ లీడర్ (రీసెర్చ్ & కన్సల్టెన్సీ) – రూ. 2,25,000
అసోసియేట్ (రీసెర్చ్ & కన్సల్టెన్సీ) – రూ. 1,50,000
చీఫ్ మేనేజర్ (ఫండ్స్ / ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ / ఇన్సూరెన్స్) – రూ. 50,370 (ఒక్కొక్కటి)💥💥💥
సీనియర్ కన్సల్టెంట్ (ఐటీ) – రూ. 2,25,000💥💥💥
సీనియర్ మేనేజర్ (ఐటీ / ఫండ్స్ / అకౌంట్స్) – రూ. 60,000 / 42,281💥💥💥
మేనేజర్ (హెచ్ఆర్/అడ్మిన్ / అకౌంట్స్ / ఎఫ్ఐ) – రూ. 35,822💥💥💥
విద్యార్హతలు, అనుభవం (సంక్షిప్తం):💥💥💥
జనరల్ మేనేజర్: పోస్ట్గ్రాడ్యుయేట్ (CA/MBA/PGDBM ప్రాధాన్యం) + 20+ సంవత్సరాల సీనియర్ లీడర్షిప్ అనుభవం.💥💥💥
డిప్యూటీ జనరల్ మేనేజర్ & అసిస్టెంట్ జనరల్ మేనేజర్: సంబంధిత విభాగంలో పోస్ట్గ్రాడ్యుయేట్ + 12-20 సంవత్సరాల అనుభవం.💥💥💥
చీఫ్ మేనేజర్: గ్రాడ్యుయేట్ (MBA/CA/CFA ప్రాధాన్యం) + 8-10 సంవత్సరాల అనుభవం.💥💥💥
సీనియర్ మేనేజర్ / మేనేజర్: పోస్ట్గ్రాడ్యుయేట్ + 1-5 సంవత్సరాల అనుభవం.💥💥💥
అన్ని పోస్టులకు తెలుగు భాషా పరిజ్ఞానం కావాల్సింది. SHG ఫెడరేషన్, రూరల్ బ్యాంకింగ్, NBFC-MFI అనుభవానికి ప్రాధాన్యం.💥💥💥
వయోపరిమితి:
పోస్ట్ ననుసరించి 25 నుంచి 63 సంవత్సరాల మధ్య వయసు. రిలాక్సేషన్ SC/ST అభ్యర్థులకు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు (నాన్-రీఫండబుల్):💥💥💥
జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, టీమ్ లీడర్, అసోసియేట్, చీఫ్ మేనేజర్, సీనియర్ కన్సల్టెంట్ IT పోస్టులకు – రూ. 885 (GSTతో)
సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు – రూ. 590 (GSTతో)💥💥💥
చెల్లింపు బ్యాంకు ఖాతా: SBI, ఆదర్శ్ నగర్ – హైదరాబాద్, IFSC: SBIN0020263, ఖాతా సంఖ్య: 38503776901💥💥💥
దరఖాస్తు ఎలా చేయాలి?
అధికారిక వెబ్సైట్ (www. streenidhi. telangana. gov. in) నుండి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకోండి. దీనిని నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు (చదువు, అనుభవం, ఫీజు చెల్లింపు రసీదు, CV, ఫోటో ID) అటాచ్ చేసి, కింది చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా ప్రత్యక్షంగా చేరవేయాలి. చివరి తేదీ: 20-05-2026. ప్రతి అభ్యర్థి ఒక్క పోస్ట్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బయటి కవరుపై “Application for the post of [Post Name], Post Code No: __” అని రాయాలి.💥💥💥
చిరునామా:
The Managing Director, Stree Nidhi Credit Cooperative Federation Ltd., #4th Floor, 401 & 402, My Home Sarovar Plaza, 5-9-22/B, Secretariat Road, Saifabad, Hyderabad – 500063, Telangana
ముఖ్య సూచనలు:
ఈ పదవులు కాంట్రాక్ట్ బేసిస్పై మాత్రమే. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదా ఫ్రాడ్లో పాల్గొన్న అభ్యర్థులు అనర్హులు. గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూకు హాజరై ఎంపికకాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోకూడదు. స్త్రీ నిధితో గతంలో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వారు అర్హులు కారు. ఇంటర్వ్యూకు TA/DA ఉండదు.
