
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దీనితో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

❇️ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కీలకమైన సూచనలు చేశారు.
❇️ జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

❇️ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
❇️ ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, జి. మధుసూదన్ రెడ్డి గారు, టి. మేఘా రెడ్డి గారు, కె. రాజేశ్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, వీర్లపల్లి శంకరయ్య గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు పాల్గొన్నారు.
