
POCSO చట్టం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు.. బండి భగీరథ కేసు దేశానికి ఇస్తున్న పెద్ద సందేశం!
“” “” “” “” “” “” “” “” “” “” “” “” “” “” “” “” “” “”

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన బండి భగీరథ్ POCSO కేసు కేవలం ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన వివాదంగా మాత్రమే కాదు, మన సమాజం చట్టాల గురించి ఎంత తక్కువ అవగాహనతో ఉందో బయటపెట్టిన సంఘటనగా మారింది. సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో, రాజకీయ వేదికలపై ఈ కేసుపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చర్చల మధ్య చాలా మంది అసలు POCSO చట్టం ఏమి చెబుతుందో, ఇందులో consent కి ఎంతవరకు విలువ ఉందో, minor హక్కులు ఎలా రక్షించబడతాయో పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

POCSO అంటే “Protection of Children from Sexual Offences Act, 2012”. ఈ చట్టం బాలురు, బాలికలు ఇద్దరికీ సమాన రక్షణ కల్పిస్తుంది. అంటే ఇది gender neutral law. 18 సంవత్సరాల లోపు వయసున్న ఏ చిన్నారిపైనా లైంగిక దాడి జరిగినా, లేదా లైంగికంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరిగినా, చట్టం చాలా కఠినంగా స్పందిస్తుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. minor consent అనే అంశానికి భారత చట్టాల్లో పూర్తి చట్టబద్ధత లేదు. అంటే ఇద్దరూ ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు అని చెప్పినా, ఒకరు మైనర్ అయితే అది చట్టపరంగా రక్షణ ఇవ్వదు.
ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ కేసులో కూడా “హనీ ట్రాప్”, “consensual relationship” వంటి పదాలు వినిపిస్తున్నాయి. కానీ POCSO చట్టం దృష్టిలో ఇవి బలమైన రక్షణ వాదనలు కావు. ఎందుకంటే చట్టం చిన్నారి భద్రతను మాత్రమే ప్రధానంగా చూస్తుంది. ఒక minor నిర్ణయం తీసుకునే వయస్సులో లేడని భావించి, అతనికి లేదా ఆమెకు ప్రత్యేక రక్షణ ఇస్తుంది. అందుకే పిల్లల విషయంలో consent కంటే protection కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొందరు పెద్దలు ఈ తరహా కేసుల్లో “పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది” అనే మాటలు మాట్లాడటం. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి ఆలోచనల వల్ల మహిళలు, చిన్నారులు ఎన్నో దశాబ్దాలు నరకం అనుభవించారని తర్వాత గ్రహించాయి. ఒకప్పుడు “Marry Your Rapist” అనే భావన కొన్ని దేశాల్లో చట్టబద్ధ రక్షణలా ఉండేది. అంటే అత్యాచారం చేసిన వ్యక్తి బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటే శిక్ష తప్పించుకునే అవకాశం ఉండేది. కాలక్రమంలో మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల పోరాటాలు ఈ క్రూరమైన ఆలోచనలను ప్రపంచానికి బహిర్గతం చేశాయి. ఎందుకంటే పెళ్లి అనేది శిక్ష నుంచి తప్పించుకునే మార్గం కాదు. బాధితురాలిని జీవితాంతం అదే మానసిక వేదనలో ఉంచే వ్యవస్థగా మారుతుంది.
ఇండియాలో కూడా Romeo-Juliet Exception గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. టీనేజ్లో పరస్పర అంగీకారంతో ఏర్పడే సంబంధాలను ప్రత్యేకంగా చూడాలా అనే అంశంపై న్యాయవాదులు, న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న భారత చట్టాల ప్రకారం minor involvement ఉన్నప్పుడు consent అనే వాదనకు పరిమిత విలువ మాత్రమే ఉంది.
ఈ మొత్తం వ్యవహారం మన సమాజానికి ఒక పెద్ద పాఠం చెబుతోంది. చట్టం ముందు పేదవాడు, ధనవంతుడు, రాజకీయ నాయకుడు, సామాన్యుడు అనే తేడా ఉండకూడదు. అదే సమయంలో సోషల్ మీడియా ట్రయల్స్ కంటే చట్టపరమైన అవగాహన పెరగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తల్లిదండ్రులు, యువత, విద్యార్థులు POCSO చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. ఎందుకంటే అవగాహన లేకపోవడం ఒక కుటుంబాన్ని, ఒక చిన్నారి భవిష్యత్తును, ఒక సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
