💥💥💥స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష💥💥💥

1000393333

స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష

✅మంగళ వారం నాడు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన 2 రోజుల పాటు నిర్వహిస్తున్న “స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0” జాతీయ సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు.

✅ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పట్టణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ–ప్రాసెసింగ్, పాత చెత్త కుప్పల తొలగింపు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, పీపీపీ విధానాలు, కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు . రాష్ట్రాలు, నగరాల అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడంపై కూడా చర్చించనున్నారు.

1000393332

✅ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ విధానాలు, ఇంటింటి చెత్త సేకరణ, 4-వే సోర్స్ సెగ్రిగేషన్, ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లు, వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్, పాత డంప్‌యార్డుల బయోమైనింగ్, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు, ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలు, ఈ-వేస్ట్ సేకరణ, కిటాక్యుషు మోడల్‌లో ఎకో టౌన్ ఏర్పాటు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి వివరించనున్నారు.

✅తెలంగాణ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని స్వచ్ఛమైన, పర్యావరణహితమైన, సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా ఉప ముఖ్యమంత్రి సమావేశంలో వివరించనున్నారు.

✅ఈ సమావేశంలో మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ తోఖన్ సాహు , కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కటికితల , శ్రీమతి రూపా మిశ్రా,పలు రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు,అధికారులు పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *