పత్రికా ప్రకటన
ముత్యంపేట గ్రామపంచాయతీ లో గ్రామ పంచాయతీ ఆస్తిని అక్రమంగా /చట్ట విరుద్ధంగా అమ్ముకున్న VDC కార్యవర్గం.
చేదించిన సిటిజన్ రైట్స్ కౌన్సిల్ ® బృందం.
వి డి సి సభ్యులు విక్రయించిన భూమిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తున్న గ్రామస్తులు.
వివరాలు కి వెళ్తే జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, ముత్యంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ / పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ప్రభుత్వ భూమిని గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన ఘటనపై సిటిజన్ రైట్స్ కౌన్సిల్ ® (పౌర హక్కుల మండలి) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో గ్రామ ప్రజల కోసం నీటి శుద్ధి కేంద్రం మరియు ప్రజా మరుగుదొడ్ల కు వినియోగించిన గ్రామ ఉమ్మడి భూమి, ఎటువంటి గ్రామ సభ లేదా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా అక్రమంగా విక్రయించబడింద ని సిటిజన్ రైట్స్ కౌన్సిల్ రికార్డు తనిఖీల్లో భాగంగా గుర్తించింది.
ఈ భూమి ప్రజా ఆస్తి , ఏ వ్యక్తి లేదా VDC సభ్యుల ప్రైవేట్ ఆస్తి కాదని స్పష్టం సిటిజన్ రైట్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
చేసిన దొంగతనా న్ని కప్పు పుచ్చుకునేందు కు వీడీసీ సభ్యులు ఆ భూమి ఇప్పటికే అమ్ముడైంద ని పేర్కొంటూ, అక్కడ నిర్మించిన ప్రైవేట్ భవనాలకు ఇంటి నంబర్లు కేటాయించాలని VDC గ్రామ పంచాయతీ పై ఒత్తిడి తెస్తోందని సిటిజెన్రైట్స్ కౌన్సిల్ ఆరోపిస్తుంది.
వి డి సి సభ్యులు నిర్వహించిన అక్రమ లావాదేవీలు చట్టబద్ధం చేయాలనే ప్రయత్నిస్తున్నారని సి ఆర్ సి పంచాయతీరాజ్ అధికారులకు నివేదిక అందించింది.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 ప్రకారం గ్రామ అభివృద్ధి కమిటీకి భూమి అమ్మే అధికారం లేదని, VDC కేవలం ఒక సలహా సంఘమేనని సిటిజన్ రైట్స్ కౌన్సిల్ ® గుర్తు చేసింది. అయినప్పటికీ, ఈ అక్రమ అమ్మకంపై ముత్యంపేట గ్రామ పంచాయతీ కమిటీ చర్యలు తీసుకోకపోవడం, ఇంటి నంబర్లు కేటాయించే ప్రక్రియ ప్రారంభించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించింది.
ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్, సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులు మరియు పంచాయతీ రాజ్ మంత్రివర్యులకు ఫిర్యాదు చేసినట్లు మండలి తెలిపింది. అక్రమ భూ లావాదేవీలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
— సిటిజన్ రైట్స్ కౌన్సిల్ ®
(పౌర హక్కుల మండలి)
