💥💥💥విజయవాడ : పటమట : ది డెస్క్ : UPDATE :💥💥💥

🔴 విజయవాడ : పటమట : ది డెస్క్ : UPDATE :

▪️బెజవాడలో బ్యాడ్ బాయ్స్▪️

మదమెక్కి… మతి తప్పి..!

నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టుకుంటూ..

వేకువ నుంచే వాట్సప్ లో ఇద్దరి మధ్య మొదలైన రచ్చ

డ్రగ్ పరీక్షలో ఓమ్ కు పాజిటివ్.. గంజాయి వాడటంతోనే..

రోహిత్ జీపులో సిరంజి, ఎలక్ట్రిక్ సిగరెట్ స్వాధీనం

A1గా బోల్లా ఓమ్

A2గా లింగమనేని రోహిత్

యువతి కోసం ఘర్షణ పడి నడిరోడ్డుపైనే జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించిన ఘటనలో.. వేకువ నుంచే ఇద్దరు యువకుల మధ్య వాట్సాప్ లో రచ్చ మొదలైంది.

గురువారం వేకువ నుంచి ఒకరికొకరు ఫోన్ చేసి రెచ్చగొట్టుకున్నారు. తన గురించి హైదరాబాద్ లో ఉంటున్న యువతికి ఓమ్ చెడుగా చెబుతున్నాడని రోహిత్ ఘర్షణ పడ్డాడు.

రోహిత్ గురువారం వేకువన 4.30 గంటలకు ఓమ్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. ‘నువ్వేం అడిగినా నేనిచ్చా. నా గురించి ఎందుకు చెడుగా చెబుతున్నావని’ రోహిత్ ప్రశ్నించాడు. తాను చెప్పలేదని ఓమ్ బదులిచ్చాడు.

అలా సాయంత్రం వరకు ఫోన్లో వాగ్వాదం సాగింది. సాయంత్రం 5 గంటలకు రోహితు..

ఓమ్ ఫోన్ చేసి తన వద్దకు రావాలని సవాల్ విసిరాడు. రాత్రి 7 గంటలకు మళ్లీ ఫోన్ చేసి ఇంకా రాలేదని రెచ్చగొట్టేలా రోహిత్ తో మాట్లాడాడు.

ఆపై రాత్రి 8 గంటలకు ఆర్ఆర్ గార్డెన్ సమీపంలో హైటెన్షన్ రోడ్డుకు రోహిత్ చేరుకున్నాడు.

డ్రగ్స్ పరీక్షల్లో ఓమ్ కు పాజిటివ్ :

ఘర్షణ తర్వాత పోలీసులు ఇద్దరి వాహనాలను పరిశీలించారు. ఓమ్ వాహనం చక్రం ఊడిపోయింది. రోహిత్ జీపులో ఎలక్ట్రిక్ సిగరెట్ కిట్..

స్టెరాయిడ్స్ వాడటానికి వినియోగించే సిరంజ్ దొరికాయి. రోహిత్, ఓమ్ లు..

కండరాల పెంపునకు భారీగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దీంతో ఇద్దరికీ పోలీసులు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఓమ్ కు పాజిటివ్ రాగా..

గంజాయి తీసుకోవడం వల్లేనని గుర్తించారు. రోహిత్ కు నెగటివ్ వచ్చింది. గంజాయి, మత్తు పదార్థాలు తీసుకుంటున్నావా? అని పోలీసులు ప్రశ్నించగా.. తాను శరీర దారుఢ్యం పెంచేందుకు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాననీ..

అందుకే పాజిటివ్ వచ్చిందని బుకాయించాడు. కచ్చితత్వం కోసం రక్తనమూనాలు పరీక్షలకు పంపారు.

చేతులు ముడుచుకుని ఉండాలా…?

ఘర్షణ స్థలానికి పోలీసులు చేరుకోగానే రోహిత్ పరారవగా.. ఓమ్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విచారించారు. ‘

రోహిత్ నాపై దాడి చేస్తుంటే తిరిగి దాడి చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవాలా?’ అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.

శుక్రవారం వేకువన రోహిత్ ను పోలీసులు స్టేషన్ కు తెచ్చారు. రెండేళ్ల కిందట పరిచయమైన వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. ఓం బీబీఏ చదివి..

తండ్రి బోల్లా జితేంద్రకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చూస్తున్నాడు. రోహిత్ తాడేపల్లిలో ఓ కళాశాలలో బీబీఏ తొలిఏడాది చదువుతున్నాడు. అతని తండ్రికి ట్రాన్స్పోర్టు సంస్థ ఉంది.


ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారులో అతడి మరో స్నేహితుడూ ఉన్నాడు. అతను వారిస్తున్నా వినకుండా రోహిత్ దూకుడుగా రెచ్చిపోయాడు.

ఇద్దరి ఇళ్లల్లో సోదాలు :

మత్తు పదార్థాలున్నాయనే అనుమానంతో ఓమ్, రోహిత్ ఇళ్లల్లో శుక్రవారం రాత్రి పటమట పోలీసులు సోదాలు చేశారు. తనిఖీల్లో గంజాయి కానీ.. డ్రగ్స్ కానీ దొరకలేదు. వీరి కుటుంబాలను పోలీసులు స్టేషన్ కు పిలిచి, హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఘటనపై BNS 285, 281, 292, 351(2) 8 2 3(5) సెక్షన్ల కింద కేసు పెట్టగా.. ఏ1గా బోల్లా ఓమ్, ఏ2గా లింగమనేని రోహిత్ లను చేర్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *