👁👁👁మంగళగిరిడీఎస్సీలో అడుగడుగునా అవకతవకలేమెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలుఉద్యోగాలను 15 లక్షలకు అమ్ముకున్నారు😂😂

1000397550

మంగళగిరిడీఎస్సీలో అడుగడుగునా అవకతవకలేమెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలుఉద్యోగాలను 15 లక్షలకు అమ్ముకున్నారు

అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేవిద్యాశాఖ కమిషనర్ ను కోరిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులుడీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల్ని కలిసి నిరసన తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి, ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతా

1000397559

రెడ్డిమంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన పరీక్షల్లో అడుగడుగునా దగా కనిపిస్తోందని, ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం, మెరిట్ లిస్ట్ మాయం చేయడం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

ఇవాళ మంగళగిరిలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్ని సిబ్బంది అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. అనంతరం కమిషనర్ ను కలిసినా ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రజాప్రతినిధులు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.

1000397551

ప్రెస్ మీట్ లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే.డీఎస్సీ మెరిట్ లిస్ట్ బయటపెట్టాలి:

బొమ్మి ఇజ్రాయెల్, ఎమ్మెల్సీడీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో భాగమైన ఓ కాంట్రాక్ట్ మెరిట్ లిస్ట్ లో టాప్ లో వచ్చాడు. అతన్ని మీరు ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి.

అసలు డీఎస్సీ మెరిట్ లిస్ట్ ప్రచురించకపోవడంలో ఆంతర్యం ఏంటి ? విద్యామంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి.

1000397559

ఇవే విషయాలను విద్యాశాఖ కమిషనర్ ను అడిగేందుకు విద్య భవన్ కు వచ్చాం.

రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్ధులు రాసిన పరీక్షలో అన్యాయం జరిగింది. కాబట్టి సీబీఐ దర్యాప్తు చేయించాలి.

అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలి, బాధ్యులైన అధికారుల్ని సస్పెండ్ చేయాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.

అక్రమాల్ని సమర్ధించుకుంటున్న అధికారులు;పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీడీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరేందుకు విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం.

1000397562

అయితే ఆమె మేము చెప్పిన ఏ విషయాన్నీ ఆమె అంగీకరించకపోగా సమర్దించుకునే ప్రయత్నం చేశారు. లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన ఈ పరీక్షలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి స్టేట్ ఫస్ట్ వస్తే అతన్ని తొలగించారు.

ఆ తర్వాత రెండో మెరిట్ లిస్ట్ ఇచ్చి, దాన్ని కూడా వెబ్ సైట్ నుంచి తీసేసారు. సెలెక్షన్ లిస్ట్ వేయకుండా వ్యక్తిగతంగా కాల్ లెటర్స్ పంపించారు.

1000397549

సర్టిఫికెట్ల ధృవీకరణ చేసిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అడిగితే స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేశామన్నారు.

ఎలాంటి నిబంధనలు లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. వీటి మీద ఫిర్యాదు చేస్తే ఒక్క అధికారి కూడా స్పందించలేదు. దీనిపై ప్రజల దగ్గరే తేల్చుకుంటాం.

డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్న ఎమ్మెల్యేలు:వరుదు కల్యాణి, ఎమ్మెల్సీడీఎస్సీ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కోసం అధికారుల్ని కలుద్దామని వచ్చాం.

1000397561

కానీ అధికారులు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు.

విద్యామంత్రి లోకేష్ డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేదా ఆయన్ను సీఎం చంద్రబాబు బర్తరఫ్ చేయాలి.

డీఎస్సీలో ఉద్యోగాల్ని సైతం ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. స్పోర్ట్స్ కోటాలోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది.ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఉద్యోగే పరీక్ష రాశాడంటే పేపర్ లీక్ అయినట్లే కదా.

అందుకే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి :మద్దిల గురుమూర్తి,

తిరుపతి ఎంపీడీఎస్సీ కానీ, మరేదైనా పోటీ పరీక్ష జరిగితే మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలు వచ్చేవి.

కానీ కూటమి ప్రభుత్వం ముందే విజేతల్ని ఎంపిక చేసుకుని పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపించుకున్నారు.

మెరిట్ లిస్ట్ బయటపెట్టకపోవడమే ఈ అనుమానాలకు కారణం. దీంతో మెరిట్ అభ్యర్ధులకు అన్యాయం జరిగింది. వాళ్లే ప్రశ్నాపత్రాలు తయారు చేయడం, వాళ్లే పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకోవడం, అన్నీ బయటపడ్డాక తొలగించడం జరిగింది.

ఇలా రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. అందుకే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం.

విద్యార్ధులకు అన్నివిధాలా అండగా ఉంటాం.తప్పు చేశారు కాబట్టే తప్పించుకుంటున్నారు:తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్రంలో సూట్ కేసుల పరిపాలన లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

నీరో చక్రవర్తి తరహాలో రాష్ట్రంలో విద్యార్ధులు, నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే నారా చక్రవర్తులు మహానాడులో ఫిడేల్ వాయించుకుంటున్నారు.

ఇధి మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ. డీఎస్సీ కన్వీనర్ గా టెట్ కన్వీనరే ఉన్నా తొలగించకుండా, విద్యాశాఖలో జేడీగా ఉన్న తమ అనుకూల వ్యక్తి అనే పేరుతో కొనసాగించారు.

డబ్పులు దండుకునే డార్క్ ఆపరేషన్ జరిగిందని ఆడియో టేపుల్ని వింటే అర్దమవుతోంది. 15 లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆడియో టేపుల్లో ఉంది. ఏ దేశంలోనూ ఇలాంటి అక్రమాలు జరిగి ఉండవు.

పరీక్ష నిర్వహించే వ్యవస్ధలో చిరు ఉద్యోగే పరీక్ష రాసి, టాప్ లో వస్తాడు, అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. తప్పు చేశారని చెప్పేందుకే కమిషనర్ ఇవాళ ఆఫీసులో ఉండి తప్పించుకున్న తీరే నిదర్శనం.

కష్టపడి చదివిన వారికి ర్యాంకులేవీ ?:ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీడీఎస్సీలో అక్రమాలపై వినతిపత్రం కమిషనర్ కు ఇచ్చి సీబీఐ దర్యాప్తు కోరడమే మా ఉద్దేశం. కానీ జాయింట్ డైరెక్టర్ మాతో మాట్లాడకుండా మీడియాతో మాట్లాడుతున్నాడు.

నవీన్ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉంటూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్ధులకు మాత్రం ఫస్ట్ ర్యాంక్ రాలేదు.

అందుకే సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరాం. అధికారుల తీరు చూశాక వినతిపత్రం ఇవ్వకుండానే వెనక్కి వచ్చాం. ఇప్పటికైనా విద్యార్ధులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్సీపీ తరఫున పోరాటాలు చేస్తాం.

అనుమానాస్పదంగా అధికారుల తీరు:కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీడీఎస్సీలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేయించాలని కోరాం.

ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎన్వోసీ ఇవ్వాలని చెప్పామని, కానీ అతను ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు.

సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం మీరు అతనికి కాల్ చేశారా లేక మెసేజ్ ఇచ్చారా చెప్పాలి.

ఇవేవీ జరగలేదు. అందుకే మెరిట్ లిస్ట్ ను వెబ్ సైట్ నుంచి డిలీట్ చేశారు. సర్టిఫికెట్ల ధృవీకరణకు అర్ఙుడైన అభ్యర్ధి రాకపోతే అధికారులు కాల్ చేస్తారు.

కానీ ఇక్కడ అలా జరగలేదు. అతను ఇవాళ కోర్టుకు ఎందుకు వెళ్లాడో చెప్పాలి. డీఎస్సీలో అభ్యర్ధులకు అన్యాయం జరిగింది కాబట్టే మెరిట్ లిస్ట్ బయటపెట్టలేదు.

ఈ విషయాలపై ఇప్పటికైనా దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *