
▶️ప్రగతిశీల భావాజాలంతోనే సమస్యల పరిష్కారం సాధ్యం
▶️సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
▶️ఆదిలాబాద్ జిల్లా ప్రజావాణి పైలెట్ ప్రాజెక్టు నివేదిక ఆవిష్కరణ
✅ప్రగతిశీల భావజాలం ఉంటే ప్రజావాణికి వచ్చే సమస్యల మూలాలు అర్థమై వాటి పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు.
✅ మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి అమలు తీరుపై పైలెట్ ప్రాజెక్టు నివేదికను చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు.
✅ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజావాణికి వివిధ సమస్యలతో వచ్చే దరఖాస్తుదారుల పట్ల అధికారులు, సిబ్బంది సానుకూల ధోరణితో స్పందించాలని, అప్పుడే పిటిషనర్ల ముఖంలో సంతోషం చూడగలుగుతామని పేర్కొన్నారు.
✅రాష్ట్ర, జిల్లా స్థాయిలో కొనసాగుతున్న ప్రజావాణిని డివిజన్ స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం విస్తరించిందని, రానున్న కాలంలో మండల స్థాయిలో కూడా ప్రజావాణిని నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చిన్నారెడ్డి తెలిపారు.
✅సీఎం ప్రజావాణిలో ఓపికతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.
✅ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, నిర్వాహకులు హర్ష, ఆనందిత, అభిషేక్, అఖిల్, సీఎం ప్రజావాణి అధికారులు రాకేష్ రెడ్డి, జగన్, సహదేవ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
