💥💥💥బాగా ఎదిగిన తండ్రులకు, కొన్నిసార్లు పిల్లలే SON Stroke అవుతారు!💥💥💥

“బాగా ఎదిగిన తండ్రులకు, కొన్నిసార్లు పిల్లలే SON Stroke అవుతారు!”

ఇటీవల బయటపడిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో వెలుగులోకి వచ్చిన ఒక తండ్రి-కొడుకుల కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ ఘటన కేవలం ఒక ఎగ్జామ్ స్కామ్ కథ కాదు, ఇది డబ్బుతో భవిష్యత్తు కొనాలని చూసిన ఒక కుటుంబం ఎలా చివరకు తమ జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టుకుందో చెప్పే ఉదాహరణ.

రాజస్థాన్‌కు చెందిన దినేష్ బివాల్ అనే వ్యక్తి తన కొడుకు రిషి బివాల్ ఎలాగైనా డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు.
కానీ చదువు, కష్టం, ప్రతిభ మీద నమ్మకం పెట్టుకోకుండా, shortcuts కోసం వెళ్ళాడు.

NEET పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ చేసే ముఠాతో సంప్రదింపులు జరిపి, యష్ యాదవ్ అనే మధ్యవర్తి ద్వారా అసలు పరీక్షలో వచ్చే 120 ప్రశ్నల “గెస్ పేపర్” కోసం ఏకంగా ₹10 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. ఇది అసలు పేపర్ కాదు, గెస్ పేపర్. సాధారణముగా ఈ పేపర్ నుండి ఎక్కువ ప్రశ్నలు అసలు పేపర్ లో వస్తాయి.

సీబీఐ విచారణ ప్రకారం పరీక్షకు దాదాపు 15 గంటల ముందే రిషి చేతికి ఈ ప్రశ్నాపత్రం, ఆన్సర్ కీ చేరాయి.

ఇక్కడ వరకు చూస్తే “ఇంత పెద్ద లీక్ దొరికితే మంచి ర్యాంక్ ఖాయం” అనిపిస్తుంది.కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.

ఫలితాలు వచ్చినప్పుడు రిషి బివాల్‌కు వచ్చిన మార్కులు కేవలం 720లో 107 మాత్రమే!

ఈ విషయం తెలిసి సీబీఐ అధికారులు కూడా షాక్ అయ్యారట. అసలు లీక్ అయిన ప్రశ్నలే చేతిలో ఉండి కూడా ఇంత తక్కువ మార్కులు రావడం ఎలా అని వారు రిషి గత విద్యా రికార్డులు పరిశీలించారు.

అప్పుడు బయటపడింది ఏమిటంటే:

  • రిషి చదువులో చాలా యావరేజ్ స్టూడెంట్
  • రాజస్థాన్ బోర్డు 12వ తరగతిలో కేవలం 50.8% మాత్రమే
  • అది కూడా గ్రేస్ మార్కులతో పాస్
  • అంటే లీక్ పేపర్ ఇచ్చినా, సమాధానాలు బట్టీ పట్టుకుని రాసే స్థాయి కూడా లేకపోయిందని అధికారులు గుర్తించారు

ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది: “డబ్బుతో ప్రశ్నాపత్రం కొనొచ్చు, కానీ మెదడు కొనగలమా?”

ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఇది కేవలం ఒక తండ్రి చేసిన పని కాదు…
మొత్తం కుటుంబమే ఒక లీక్ నెట్‌వర్క్‌లా పనిచేసిందని సీబీఐ చెబుతోంది.

దినేష్ బివాల్ సోదరుడు మంగీలాల్ బివాల్, అతని కొడుకు వికాస్ బివాల్ కలిసి ఈ పేపర్ లీక్‌ను ఒక పెద్ద వ్యాపారంగా మార్చారు.

సీకర్‌లోని కోచింగ్ నెట్‌వర్క్ ద్వారా:

  • లీకైన PDF ఫైళ్లు ప్రింట్ చేయడం
  • అద్దె ఫ్లాట్‌లో విద్యార్థులను ఉంచడం
  • ఒక్కో విద్యార్థి నుంచి ₹30 లక్షలు వసూలు చేయడం
  • దాదాపు 150 మందికి లీక్ పేపర్లు అమ్మడం

ఇలా కోట్ల రూపాయలు సంపాదించినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది.

ఇప్పుడు పరిస్థితి ఏమిటి?

  • తండ్రి దినేష్ బివాల్ అరెస్ట్
  • బంధువులు సీబీఐ కస్టడీలో
  • కోట్ల ఆస్తులపై నిఘా
  • కొడుకు రిషి పరారీలో

ఒకప్పుడు “నా కొడుకు డాక్టర్ అవుతాడు” అని కలలు కన్న కుటుంబం, ఇప్పుడు దేశవ్యాప్తంగా స్కామ్ కుటుంబంగా వార్తల్లో నిలిచింది.

ఈ ఘటన మన సమాజానికి చాలా పెద్ద పాఠం చెబుతోంది.

ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం కంటే , “ఎలాగైనా సీట్ రావాలి” అనే ఒత్తిడితో shortcuts వెతుకుతున్నారు.

కానీ నిజం ఒక్కటే డబ్బుతో పరీక్ష కొనొచ్చు
సీట్ కొనొచ్చు. మార్కులు మేనేజ్ చేయొచ్చు కానీ జ్ఞానం కొనలేరు, ప్రతిభ కొనలేరు, జీవితాంతం నిలబడే సామర్థ్యం కొనలేరు

చివరికి కష్టం చేసి వచ్చిన విజయమే నిలుస్తుంది. Shortcut తో వచ్చిన విజయం ఒకరోజు బయటపడితే జీవితాన్నే shortcut లో పడేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *