
ప్రజా సమస్యలపై పోరాటం – ప్రజావాణిలో వినతిపత్రం 🚨
తేదీ: 18-05-2026
ఉమ్మడి మాదాపూర్ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ statue నుంచి అయ్యప్ప సొసైటీ 60 ఫీట్ రోడ్ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది.
దీనివల్ల నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో:
ఉమ్మడి మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు
స్వయంగా పాల్గొని, గౌరవనీయులైన డిసి (DC) గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ దుస్థితిని అధికారులకు వివరించి, యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అభి, నీలేష్,తదితరులు పాల్గొన్నారు.
అధికారులు త్వరలోనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇట్లు,
శ్రీనివాస్ గౌడ్ అన్న క్యాంపు కార్యాలయం ఉమ్మడి మాదాపూర్ డివిజన్
