💥💥💥జలమే భారతా వని బలమని 171 ఏళ్ల క్రితమే చెప్పిన ధార్సనికుడు , అపర భగీరధుడు జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ 223వ జయంతి నేడు”నిత్య గోదావరీ స్నాన పుణ్యధోయో💥💥💥

1000391789

జలమే భారతా వని బలమని 171 ఏళ్ల క్రితమే చెప్పిన ధార్సనికుడు , అపర భగీరధుడు జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ 223వ జయంతి నేడు

“నిత్య గోదావరీ స్నాన పుణ్యధోయో మహామతిః స్మరామ్యాంగ్లేయదేశీయం, కాటనుం తం భగీరధం”

“పవిత్ర గోదావరి జలాలతో అనుధినం స్నానపానులాచరించ గల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భగీరధతుల్యుడు, ఆంగ్లదేశీయుడైన కాటన్ దొరను ఉద్దేశించి ఒక వేధ పండితుడు చేసిన స్తుతి ఇది..

ఆంగ్లేయులంటే వ్యతిరేకత ఉన్నరోజుల్లో ఒక భారతీయుడు ఆంగ్లదొరను కొనియాడడమంటే కారణం ఉండితీరాలి..

అన్నపూర్ణ అని పిలవబడే ఉభయ గోదావరి జిల్లాలు ఒకప్పుడు నిత్యం క్షామాంతో అల్లాడుతూండేవి. అతివృష్టి, అనవృష్టితో జిల్లావసులు (మన తాత, ముత్తాతలు) అనేక మంది మృత్యువాత పడ్డారు.

ఆకలికి తమ పిల్లలను సైతం అమ్ముకునే పరిస్తితి ఉండేది 1831-40 సం.. మద్యకాలంలో.. దీనికి పరిష్కారంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ కాటన్కు అప్పగించింది.

జనరల్ కాటన్ ఉభయ గోదావరి ప్రాంతాన్ని సర్వే చేసి డెల్టాప్రాంత అభివృద్దితో క్షామాన్ని అరికట్టవచ్చని గోదావరినది లోతూ, ప్రవాహ వేగాన్ని లెక్కగట్టారు.. కాల్వ మార్గాన్ని, భూమటాన్ని, నిర్ణయించారు.

రోజుకి సుమారు 15 మైళ్ళు గురంపై తిరిగి ఆనకట్ట నిర్మాణానికి రూ. 475572లు, పంటకాలువల మరమత్తులకు రూ. 15 వేలు మంజూరు చేశారు. 1847 ప్రారంభమైన పనులు ఎన్ని ఆటంకాలొచ్చినా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని 1882లో పూర్తిచేసారు.

కృష్ణనదిపై ఆనకట్ట నిర్మించడంలో, విశాక పోర్ట్ నిర్మాణంలో కాటన్మహశయుడు సేవలను అందించారు. క్షామంలో ఉన్న ఈ ప్రాంతాన్ని వ్యవసాయానికి క్షేమంగా తీసుకొచ్చిన ఘనత కాటన్కి దక్కుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఖరీఫ్లో 220933 హెక్టర్స్ వరి, సార్వలో 258993 హెక్టర్స్ లో పంటలు సాగు జరుగుతున్నదంటే కాటన్ మహశయుడు పుణ్యఫలమని ఇక్కడ రైతన్నాల విశ్వాసం..

అందుకే ఈ ప్రాంత ప్రజలు కాటన్దొర విగ్రహాలు కట్టి.. పూలమాలలు వేయడమే కాదు పాలాభిషాకాలు, నవ ధాన్యాలతో పూజలు చేస్తారు.

సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడుని స్మరించుకుంటూ.. వారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో జరుగుతున్న జలధార పనులు పూర్తి అయ్యి భూగర్భ జలాలు పెరగి రైతంగానికి ఉపయోగపడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *