💥💥💥ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.💥💥💥

1000391797

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

వివిధ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా ఆయన న్యాయ రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన జస్టిస్ చంద్రయ్య గారు సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనల వంటి అంశాలపై అనేక చారిత్రాత్మక తీర్పులు వెలువరించినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.

వారి మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటు అని, జస్టిస్ చంద్రయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. చంద్రయ్య గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *