సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం దేశ న్యాయవ్యవస్థకు ఆదర్శం..
కాగిత గోపీచంద్* ఉయ్యూరు బార్ అసోసియేషన్ కార్యవర్గం హర్షంఉయ్యూరు ప్రజాకాంక్ష ప్రతినిధి:
భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పరిపాలనా పరంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు అత్యంత అభినందనీయమని ఉయ్యూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాగిత గోపీచంద్ శుక్రవారం ఒక ప్రకటనలో కొనియాడారు.
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రతిని తాము అందుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల్లోని ముఖ్యాంశాలను ఉయ్యూరు బార్ అసోసియేషన్ సభ్యుల మరియు ప్రజల సమాచారం కోసం వివరించారు.
ప్రతి సోమవారం, శుక్రవారం మరియు పాక్షిక సెలవు దినాలలో జరిగే అన్ని కేసుల విచారణలు ఇకపై కేవలం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే సాగుతాయి. దీనివల్ల న్యాయవాదులకు, క్లయింట్లకు సమయం, శ్రమ ఆదా అవుతాయి. ఇంధన పొదుపు,
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా కార్-పూలింగ్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించడం దేశానికే ఒక గొప్ప సందేశం.
కోర్టు విధులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలో 50% సిబ్బందికి వారానికి రెండు రోజుల పాటు ఇంటి నుండి పనిచేసే వెసులుబాటు కల్పించడం సిబ్బంది పనిభారాన్ని తగ్గిస్తుంది.
సుప్రీంకోర్టు తీసుకున్న ఈ ఆధునిక, పర్యావరణ అనుకూల నిర్ణయాలు దేశంలోని మిగిలిన అన్ని దిగువ న్యాయస్థానాలకు, బార్ అసోసియేషన్లకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
ఉయ్యూరు బార్ అసోసియేషన్ తరఫున ఈ సంస్కరణలను మేము పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నాము గోపీచంద్ తెలిపారు.
ఈ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉయ్యూరు పరిసర ప్రాంత న్యాయవాదులు, క్లయింట్లు సాంకేతిక మార్పులను గమనించి సహకరించవలసిందిగా ఆయన కోరారు.
