💥💥💥💥పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ💥💥💥💥

1000389598

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ…

🔹తెలంగాణకు జలద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ను కిలోమీటర్ లోతున బొంద పెడతాం.

🔹తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన నీళ్లు దక్కలే.

🔹సమైక్య రాష్ట్రంలో ఆంధ్రోళ్లను నిందించినం.. మన పార్టీ.

🔹మేం అధికారంలోకి వచ్చాక వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం.

🔹సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తాం.

🔹నీళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ప్రజలు వాళ్లను క్షమించరు.

🔹పదేళ్లు అధికారంలో ఉన్న మన బీఆర్ఎస్ పాలకులే మనకు అన్యాయం చేశారు.

దసరా నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రభుత్వం ప్రారంభించాలి .ా నీళ్లు ఇవ్వలేదు.

🔹ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసింది.

🔹దసరా నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రభుత్వం ప్రారంభించాలి లేదంటే ప్రాజెక్ట్ పరివాహాక ప్రాంతంలో పాదయాత్ర చేస్తాం.

🔹తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టింది

🔹పాలమూరు-రంగారెడ్డి కి కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలి.

🔹తెలంగాణ రక్షణ సేన ఏర్పడిన తర్వాత మొదటి సారిగా మహబూబ్ నగర్ జిల్లాలో సభ పెట్టుకోవటం సంతోషం.

🔹నేను జోగులాంబ అమ్మవారి భక్తురాలిని. మొదటి మీటింగ్ ఇక్కడే పెడతామని గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.

🔹తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు పిడికిలి బిగించిన సరే ప్రజలు మద్దతిచ్చి వారిని గెలిపించారు.

🔹ఆ పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మార్పులు వచ్చాయి అలాగే తెలంగాణ రక్షణ సేన నుంచి నీటి ఉద్యమాన్ని చేపడుతున్నాం.

🔹తెలంగాణ చరిత్రలో ఇది రాసిపెట్టుకోవాల్సిన రోజు.

🔹నీళ్ల కోసమే మనం తెలంగాణ పోరాటం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే.

🔹పల్లె పల్లెన పల్లెరు కాయలు మొలిసినయంటూ గతంలో మనం ఆవేదన చెందాం.

🔹మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణానది 3 వందల కిలోమీటర్లు పారుతున్న సరే మనకు నీళ్లు రాని పరిస్థితి.

🔹బీర బీర కృష్ణమ్మ నీళ్లన్నీ కూడా ఆంధ్రాకే వెళ్లిపోయాయి.

🔹తెలంగాణ తెచ్చుకున్నాక 12 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదు.

🔹బీమా, నెట్టంపాడు, కోయిల ప్రాజెక్ట్ లను కూడా మనం పూర్తి చేసుకోలేదు.

🔹పాలమూరుకు కృష్ణానది నుంచి రావాల్సిన నీళ్లు రాలేదు.

🔹బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కృష్ణా నీళ్లు మనకు రాలేదు.

🔹పాలమూరు-రంగారెడ్డి కోసం 33 వేల కోట్లు ఖర్చు చేసి 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు.

🔹ఆంధ్రావాళ్లు ఉన్నప్పుడు మనకు నీళ్లు రాకుండా చేస్తున్నారని మనం తిట్టుకున్నాం కానీ అవసరానికి ఆంధ్రావాళ్లను తిట్టి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కూడా మనకు చుక్క నీళ్లు తేలేదు.

🔹పాలమూరు అంటే మేధావులు, కళాకారులు ఉంటారు. మీరంతా ఒక్కసారి ఆలోచించాలి.

🔹మన పాలకులే మనల్ని మోసం చేశారు. ఇది నిజమా అంటే అక్షరాల నిజం.

🔹ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి జురాల నుంచి నీళ్లు తీసుకునేందుకు జీవో 72 తెచ్చారు కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బేషజాలకు పోయింది.

🔹జురాల సోర్స్ పాయింట్ ను శ్రీశైలంకు మార్చింది.

🔹బీఆర్ఎస్ పార్టీ చేసింది క్షమించరాని నేరం ఆ తర్వాత నీళ్లు తీసుకునే ఎత్తును కూడా పెంచారు.

🔹బీఆర్ఎస్ లో ఉన్న ఒక గుంటనక్క కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నీళ్లు తీసుకునే ఎత్తును పెంచారు.

🔹అప్రోచ్ ఛానెల్ 140 మీటర్లు ఉండాల్సింది. కానీ దాన్ని 50 మీటర్లకు కుదించారు.

🔹రిజర్వాయర్లు కట్టారు. కానీ అవసరమైనే చిన్న కాలువలు మాత్రం కట్టలేదు.

🔹శ్రీశైలం కు సోర్స్ పాయింట్ మార్చటంతో మనకు రోజు ఆంధ్రావాళ్లతో పంచాయితీ అవుతోంది.

🔹ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న లక్ష్మిదేవి పల్లిలోని చౌదరి గూడెం తెలంగాణలోనే ఎత్తైన ప్రదేశం.

🔹ఇక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి జిల్లాకు 4 లక్షలు, మహబూబ్ నగర్ జిల్లాకు 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చు కానీ బీఆర్ఎస్ చేసిన తప్పునే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోంది.

🔹రిజర్వాయర్లు కట్టి కమిషన్లు దండుకున్నారే తప్ప చుక్క నీళ్లు తేలేదు.

🔹మా ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇదే ప్రాంతంలో ప్రాజెక్ట్ కడుతామని మీకు మాట ఇస్తున్నా.

🔹మాట్లాడితే నల్లమల్ల పులి బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.

🔹పాలమూరు బిడ్డలు కాంగ్రెస్ కు 12 సీట్లు ఇస్తే ఇప్పటి వరకు కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయలేదు.

🔹పాలమూరు కు మీరు చేస్తున్న ద్రోహానికి ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీ ని కిలోమీటర్ లోతులో బొందపెడుతారు.

🔹పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా దీనికి బాధ్యత తీసుకోకపోతే ఎవరికీ చెప్పుకోవాలి?

🔹చుక్క నీళ్లు ఇవ్వకుండా మోటార్లు, పంప్ లు అంటూ 6 వేల కోట్లు ఖర్చు చేశారు.

🔹కక్కుర్తితో కమిషన్లు తిని ప్రజలకు అన్యాయం చేశారు. ఈ పాపంలో జిల్లాలోని అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భాగం ఉంది.

🔹దసరా వరకు మీకు టైమ్ ఇస్తున్నాం. లక్ష్మిదేవి పల్లిలో రిజర్వాయర్ కట్టాల్సిందే.

🔹లేదంటే దసరా తెల్లారి నుంచే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పరివాహాక ప్రాంతంలో పాదయాత్ర చేస్తాం.

🔹నేను చేసిన విమర్శలతో రేపటి నుంచి గులాబీ దండు నాపై ఆటాక్ చేస్తారు.

🔹కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించి చాలా జిల్లాల్లో ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు.

🔹ఆదిలాబాద్ లో తుమ్మిడి హెట్టి, వార్దా కడుతామని చెప్పి అది కట్టలేదు.

🔹నిజామాబాద్ లో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.

🔹కరీంనగర్ లో ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్ట్ లకు ఆయకట్టు స్థిరీకరణ మాత్రమే చేశారు.

🔹ఒక్క మెదక్ జిల్లాలో మాత్రమే లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.

🔹వరంగల్ లో కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. 25 ఏళ్లుగా దేవాదుల కూడా పూర్తి చేస్తలేరు.

🔹నల్గొండలో ఒక్క కొత్త రిజర్వాయర్ లేదు. దిండికి కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వలేదు.

🔹నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ని లింక్ చేస్తున్నారు.

🔹ఇవ్వాళ పేపర్లో వార్త చూస్తే బాధనిపించింది. కృష్ణాలో ఆంధ్రావాళ్లు 770 టీఎంసీలు వాడుకున్నారు.

🔹మనం 221 టీఎంసీలు మాత్రమే వాడుకున్నాం.

🔹మన దగ్గర పారుతున్న కృష్ణానది నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి.

🔹వాళ్లను మనం అనాల్సిందేమీ లేదు. తెలివిగా డ్యామ్ లు, చెక్ డ్యామ్ లు కట్టుకున్నారు వాళ్ల ప్రజలకు మేలు చేసేందుకు అవినీతి చేయకుండా పనులు చేసుకున్నారు.

🔹బీఆర్ఎస్ కు పదేళ్లు ప్రజలు ఇచ్చిన అవకాశం పొగొట్టుకుంది.

🔹కాంగ్రెస్ రెండున్నరేళ్లు గడిచిన సరే బుద్ది తెచ్చుకోవటం లేదు.

🔹కొడంగల్-నారాయణ పేట్-మక్తల్ పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నాడు.

🔹రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దాన్ని లక్ష ఎకరాలకు కుదించారు.

🔹అసలు ముఖ్యమంత్రి మొత్తం పాలమూరును కదా ముందు పూర్తి చేయాలి. కానీ అది చేయటం లేదు.

🔹నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టింది.

🔹మేము అధికారంలోకి వచ్చాక జురాలను సోర్స్ గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం చేస్తాం,

🔹జురాలలో వరద నీళ్లు ఉంటాయి. ఎంత దమ్ముంటే అంత ఎత్తి పోసుకోవచ్చు.

🔹పేరుకు 2 టీఎంసీలే అంటారు. కానీ మనం ఐదు టీఎంసీలను 35రోజుల పాటు ఎత్తిపోసుకోవచ్చు చేసే అవకాశం మనకు ఉన్నప్పటికీ పాలకులకు ఆ మనసు లేదు.

🔹ఇప్పుడు చెరువులు నింపి వదిలేస్తున్నారు. నిండిన చెరువులను పర్యవేక్షించేందుకు లష్కర్ లను నియమిస్తాం.

🔹వాళ్లు చెరువుల నుంచి నీళ్లు పొలాల వద్దకే వెళ్లే వరకు పర్యవేక్షిస్తారు.

🔹వాటర్ కమిషన్ ను కూడా నియమిస్తాం. ఇరిగేషన్, వాటర్ మేనేజ్ మెంట్ ను వాటర్ కమిషనే చూసుకుంటుంది.

🔹మీకు ప్రమాణం చేసి నేను మాట ఇస్తున్నా. నీళ్ల కోసం చేస్తున్న ఉద్యమానికి మాకు మద్దతివ్వండి.

🔹పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా ఇవ్వాల్సిన బీజేపీ కూడా మోసం చేస్తోంది.

🔹ఇక్కడి ఎంపీ అరుణమ్మ గారు 10 తారీఖున ఇక్కడకు వస్తున్న మోడీని అడిగి మనకు జాతీయ హోదా తేవాలి.

🔹జాతీయ హోదా తో పాటు, జనగణనలో బీసీ కాలమ్ ఉండాలి, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బీసీ బిల్లుకు ఆమోదం తెలుపాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *