💥💥💥💥మహిళల ఆర్థిక సాధికారతకుతోడ్పాటునివ్వాల్సిన స్త్రీనిధి సంస్థ అక్రమార్కులకు అడ్డాగా మారింది 💥💥💥💥

మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటునివ్వాల్సిన స్త్రీనిధి సంస్థ అక్రమార్కులకు అడ్డాగా మారింది

రిటైర్ అయి 14 ఏళ్లవుతున్నా సంస్థను తన గుత్తాధిపత్యంలో పెట్టుకొని అనేక అక్రమాలకు కారకుడైన ఎండీ ఇప్పుడు దొడ్డి దారిన సంస్థ ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్ట్ కొట్టేయడానికి స్కెచ్ వేశారు

ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈనెల 16న స్త్రీనిధి ఉద్యోగుల సమావేశంలో ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్ట్ కొట్టేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు

ఈనెల 23తో సంస్థ ఎండీగా కాలపరిమితి ముగుస్తుండటంతో ఎలాగైనా సంస్థను తన చెరలోనే ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులను దొడ్డిదారిలో కీలక పోస్టుల్లో కొనసాగించేందుకు ఎంతకైనా దిగజారడం విచారకరం

తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి సీతక్క స్పందించాలి.. స్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలి

స్త్రీనిధిలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగేలా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *