💥💥💥💥తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ*🔥🔥🔥

1000388587

* .

*🔥నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు* 🫯🌹🫯
. నిన్న బెంగాల్‌కు వెళ్లాను. బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేశారు. భారీ మెజార్టీతో బెంగాల్‌లో బీజేపీ గెలిచింది. బెంగాల్‌ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోంది. -ప్రధాని మోడీ💥💥💥

*అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.*🌹🌹🌹
*పుదుచ్చేరిలో NDA రెండోసారి అధికారంలోకి వచ్చింది.*

*తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది.*
*తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్‌ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు* . 🫂🫂

ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తొలిగాయి. -ప్రధాని మోడీ💥💥💥💥

*టీఎంసీ తానాషాహీ మోడల్‌తో ప్రజలను ఇబ్బంది పెట్టింది.*
*బెంగాల్‌ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు.
పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. -ప్రధాని మోడీ💫🔥🔥🔥

*బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే.*
దేశంలో 14 ఇండస్ట్రియల్‌ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ ఎక్కడున్నా ఒకటే మోడల్‌. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారు. ఆ తర్వాత సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. -ప్రధాని మోడీ🔥🔥🔥

*కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది.*
*కాంగ్రెస్‌ MMCగా మారింది. MMC అంటే ముస్లిం లీగ్‌ మావోవాది కాంగ్రెస్‌.* 🙈🙉
మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు. -ప్రధాని మోడీ

*కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయి.*
మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారు. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టురహితంగా మారుతోంది. యుద్ధం కారణంగా ఇంధనం సంక్షోభం వచ్చింది. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలి. మెట్రో సేవలను వాడుకోవాలి. ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించుకోవాలి. -ప్రధాని మోడీ

*కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి* .
విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి.

*ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి.*

*వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి.*

విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం. రసాయన ఎరువుల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుంది. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోగలం. -ప్రధాని మోడీ

*వ్యవసాయంలో డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నాం* . వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలి. నేను స్వదేశీ గురించి చెప్పగానే దీపావళి దీపాలు గురుంచి మాట్లాడుతారు. దీపాలు కొంటే స్వదేశీని ప్రోత్సహించినట్లు భ్రమల్లో ఉండొద్దు. -ప్రధాని మోడీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *