Date: 18-05-2026.
భార్యపై హత్యాయత్నం కేసులో భర్త అరెస్ట్ చేసిన ఉయ్యూరు పట్టణ పోలీసులు
ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై రాయి తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉయ్యూరుకు చెందిన బొర్రా పుష్ప (35) మరియు బొర్రా సాంబయ్య (36) భార్యాభర్తలు. సుమారు 15 సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది, ఇద్దరికీ రెండవ వివాహం, ఇద్దరు మగ పిల్లలు సంతానం, గత కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ విడిగా నివాసం ఉంటున్నారు.
గతంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై గతంలో కూడా కేసు నమోదు అయినది, సదరు కేసు కోర్టులో వాయిదాలు నడుస్తుంది.
విడిగా ఉంటున్నప్పట్టికీ నిందితుడు తన భార్యపై అనుమానం పెంచుకొని, ది.17-05. 2026 తేదీన తెల్లవారు జామున సుమారు 04:30 గంటల సమయంలో ఉయ్యూరు, కాటూరు రోడ్ నందు అమరావతి గ్రాండ్ హోటల్ ఎదురుగా బాధితురాలిని అడ్డగించి, రాయి తో ముఖం మరియు తలపై దాడి చేసి తీవ్ర గాయాలకు గురిచేశాడు, సమాచారం అందుకున్న ఉయ్యూరు పట్టణ పోలీసు వారు బాధితురాలిని సకాలంలో ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు, అంతట మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతూ కోలుకుంటుంది.
ఈరోజు ఉయ్యూరు పట్టణ పోలీసులు ఈ కేసులో నిందితుడు అయినా బొర్రా సాంబయ్యను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ టి.వి.వి. రామారావు మాట్లాడుతూ, నిన్న ఈ సంఘటన జరిగిన సమయంలో ముద్దాయి చేతిలో ఎటువంటి ప్రమాదకరమైన ఆయుధం లేకపోయినప్పటికీ, అక్కడ ఉన్నవారు బాధితురాలిని రక్షించడానికి ముందుకు రాకుండా ప్రేక్షకులుగా నిలబడి వీడియోలు, ఫోటోలు తీయడం చాలా అమానవీయంగా అనిపించిందన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు గట్టిగా కేకలు వేయడం ద్వారా పదిమందిని పోగు చేయడం, సురక్షితమైన దూరంలో ఉంటూ ముద్దాయిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, బాధితురాలిని అక్కడి నుండి తప్పించడం, వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో మానవత్వం మరియు బాధ్యతాయుత వైఖరి ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరారు.
