
నక్సల్స్ తీవ్రవాద నిర్మూలనలో మరియు రాష్ట్రంలో శాశ్వత శాంతి భద్రతలను నెలకొల్పడంలో తెలంగాణ పోలీస్ చేసిన కృషికి గాను, జగదల్పూర్, ఛత్తీస్‌గఢ్‌లో గౌరవనీయ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా గుర్తింపు పొందడం తెలంగాణ పోలీస్‌కు గర్వకారణం.
ఈ అవార్డును తెలంగాణ పోలీస్ తరఫున రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్, రాష్ట్ర భద్రతా సలహాదారు శ్రీ బి. శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (OCTOPUS & Greyhounds) డా. అనిల్ కుమార్ ఐపీఎస్, మల్కాజిగిరి కమిషనర్ మరియు మాజీ ఎస్ఐబీ ఐజీపీ శ్రీమతి సుమతి ఐపీఎస్, అలాగే అంకితభావంతో పనిచేసిన ఎస్ఐబీ బృందంతో కలిసి స్వీకరించారు.

ఈ గౌరవం తెలంగాణలోని ప్రతి పోలీస్ అధికారిది, ప్రతి జవాన్‌ది. ముఖ్యంగా గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, OCTOPUS మరియు ఫీల్డ్ యూనిట్ల ధైర్యం, త్యాగం, సమన్వయంతో కూడిన కష్టం వల్లే తెలంగాణ నక్సల్ రహిత రాష్ట్రంగా అవతరించింది.
తెలంగాణ పోలీస్ కృషిని గుర్తించి, నక్సల్ రహిత భారతదేశ లక్ష్యానికి రాష్ట్ర పోలీస్ సేవలను ప్రశంసించిన గౌరవనీయ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల శాంతిభద్రతలు, సంక్షేమం కోసం తెలంగాణ పోలీస్ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తూనే ఉంటుంది.
