
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ ఏసీబీ వలలో చిక్కాడు.
సైబర్ మోసం కేసులో సహాయం చేస్తానంటూ ఫిర్యాదిదారుని నుంచి రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ.
ఇప్పటికే రూ.5 లక్షలు నగదు రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ గుర్తింపు.మిగిలిన రూ.4 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించిన సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.హైదరాబాద్‌లోని తన కార్యాలయంలోనే ఏసీబీ సీఐయూ బృందం ట్రాప్ నిర్వహించింది.
ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ.సోదాల్లో లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు స్వాధీనం.బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం.ఆస్తులపై మరింత విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ.నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి.
