
*తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…**
🔹రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలు ప్రైవేట్ పరం చేసే కుట్ర**
🔹తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఈ సీఎం ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా?**
🔹ఉచిత విద్యుత్ తీసేయం, మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలి**
🔹విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం చేపడుతున్న చర్యలకు రాష్ట్రం వత్తాసు పలుకుతోంది**
🔹రైతులకు సంబంధించి డిస్కం విషయంలో ఈఆర్సీ వారి అభిప్రాయాలు తీసుకోవాలి**
🔹రైతులకు నష్టం చేసే ఈ డిస్కం కు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దు**
🔹తెలంగాణ జాగృతి తరఫున కేసు కూడా వేశాం. పర్మిషన్ ఇస్తే సుప్రీంకి వెళ్లైనా అడ్డుకుంటాం**
🔹దసరా లోపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రారంభించకపోతే తెల్లారి నుంచే పాదయాత్ర*
🔹రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త డిస్కం ను ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

తాము ఆ ప్రయత్నం చేయటం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము సీఎం కు ఉందా అని సవాల్ విసిరారు. రైతు డిస్కం ఏర్పాటు ద్వారా ఉచిత విద్యుత్, మోటార్లకు మీటర్లు పెట్టమంటూ మీడియాతో చిట్ చాట్ లో సీఎం మాట్లాడిన అంశాలపై కవిత కౌంటర్ ఇచ్చారు.
బంజరాహిల్స్ లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఈ ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్ ఎత్తివేయని చెప్తుంటేనే ఇంకా ఎక్కువ అనుమానించాల్సి వస్తోందన్నారు.
చిట్ చాట్ లో కాకుండా అవే విషయాలను ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు చెప్పాలన్నారు. బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలనే పట్టించుకోని ఈ సీఎం ఇప్పుడున్న చెబుతున్న మాటలకు కట్టుబడి ఉంటాడని నమ్మకం లేదన్నారు.
రైతులకు నష్టం చేసే రైతు డిస్కం కు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే దాన్ని అడ్డుకుంటామన్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి తరఫున కేసు వేసినట్లు కవిత చెప్పారు. *

🔹ప్రైవేట్ పరం చేయమని చెప్పే దమ్ముందా?:-*రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు సీక్రెట్ గా ఉంచిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చిట్ చాట్ పేరుతో దొంగచాటుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల ఆరోపించారు. రైతు డిస్కం కారణంగా ఉచిత విద్యుత్, రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని మేము మాట్లాడితే కాదని ఆయన అంటున్నారని చెప్పారు.
కానీ ఇదే విషయాన్ని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం లేదని ప్రశ్నించారు. బహిరంగ సభల్లోనే ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన ఈ ముఖ్యమంత్రి చిట్ చాట్ లో మాట్లాడే మాటలపై జవాబుదారీ గా ఉంటారా అని అనుమానం వ్యక్తం చేశారు.
రైతు డిస్కం పేరుతో కొత్తగా డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కం లను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. నిజంగా ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేకుంటే…డిస్కం లను ప్రైవేట్ పరం చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లమని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.
ఈ ముఖ్యమంత్రి అంత గట్టిగా చెప్పినప్పటికీ మాకు నమ్మకం కుదరకపోవటానికి గత చేదు అనుభవాలే కారణమన్నారు. ఈ సారి రైతు భరోసా ఇప్పుడు రెండు ఎకరాల లోపు వారికే ఇచ్చారు.
రైతు రుణ మాఫీ 30 శాతం మందికి కూడా కాలేదు. బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటమని చెప్పి ఇప్పటికీ కొనుగోలు సరిగా చేయటం లేదని గుర్తు చేశారు.
రైతు బీమాను యాక్సిడెంటల్ బీమాగా మార్చేసే కుట్ర చేశారన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేపట్టిన అన్ని చర్యలు రైతులకు వ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. అందుకే ముఖ్యమంత్రి చెప్పే మాటల మీద నమ్మకం కుదరటం లేదని కవిత అన్నారు. *
🔹అడ్డుకొని తీరుతాం:-*రైతు డిస్కం ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని కవిత స్పష్టం చేశారు. రైతులకు నష్టం చేసే ఈ ప్రపోజల్ ను ఈఆర్సీయే రిజెక్ట్ చేయాలని కోరారు. కొత్త డిస్కం లో రైతులే వినియోగదారులుగా ఉంటారు కనుక ఈఆర్సీ వారి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
మొత్తం 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలన్నారు. ఈఆర్సీ ఈ ప్రపోజల్ కు ఒకే చెబితే న్యాయం పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై స్వచ్ఛంద సంస్థ అయిన తెలంగాణ జాగృతి తరఫున కేసు ఫైల్ చేశామన్నారు.
సుప్రీంకోర్టు లో పోరాటం చేసైనా సరే రైతు డిస్కంను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. *
🔹చిన్న సంస్థలకు మరణశాసనం:-*కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేస్తున్న కుట్రలకు రాష్ట్ర సర్కార్ వత్తాసు పలుకుతోందని కవిత అన్నారు.
కేంద్రం ఇస్తోన్న ఒక్కో జీవో కు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని చెప్పారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా దేశంలో సోలార్ ప్యానెల్స్ తయారు చేసే చిన్న సంస్థలకు కేంద్రం మరణశాసనం లిఖిస్తోందని మండిపడ్డారు.
సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు ఇండియాలోనే తయారు చేసే కంపెనీలకే అవకాశం అంటూ కొత్తగా జీవో తెచ్చి 5 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని అన్నారు.
అలా అయితే రిలయన్స్, అదానీ సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. లక్షలాది మంది చిన్న వ్యాపారులకు నష్టం చేసే ఈ అంశాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
చిన్న వ్యాపారులంతా త్వరలోనే ఆందోళన చేపడతామని చెప్పారని వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. *
🔹లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టకపోతే పాదయాత్ర చేస్తా:-*అటు పాలమూరు ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలని కోరారు.
ఈ అంశంలో తాము పదే పదే ప్రశ్నించటంతో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తానని చెప్పారన్నారు. అందులో భాగంగా కుమ్మెర అనే గ్రామానికి వెళ్తున్నట్లు తెలిసిందన్నారు.
ఐతే అదే గ్రామంలో కులవివక్షతో ఒక పసిగుడ్డును చంపేశారని కవిత గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కచ్చితంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తాము డిమాండ్ చేసినట్లు దసరా లోపు పాలమూరు ప్రాజెక్ట్ లో భాగంగా లక్ష్మీదేవిపల్లి లో రిజర్వాయర్ పనులను ప్రారంభించాలన్నారు.
లేదంటే ఆ మరుసటి రోజు నుంచే పాదయాత్ర చేస్తానని కవిత హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో ఉన్న స్కూళ్లను బాగు చేయాలంటూ, హైడ్రా తీరు గురించి కూడా కోర్టు ఈ ప్రభుత్వంపై అక్షింతలు వేస్తున్న పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.
కోర్టు తిడుతున్నప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా మాత్రం హైడ్రాను సమర్థిస్తూ వార్తలు రాయటం బాధకరమన్నారు.
పెద్దవాళ్లను కాపాడుతూ పేదవాళ్ల ఇళ్లను హైడ్రా కూల్చుతుందని చెప్పారు. బడా వ్యక్తులు చేసే కబ్జాలపై నేను ఇచ్చిన ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టిందని కవిత గుర్తు చేశారు. *
🔹ఖమ్మంలో పసిగుడ్డుకు న్యాయం చేయాలి:-*ఖమ్మంలో ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవటానికి తీసుకొచ్చిన ఓ పసిగుడ్డు చేయి తీసేయటంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బులు అయిపోతే ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం చేయించేందుకు తీసుకొస్తే ఆ పసిగుడ్డు చేయి తీసేశారన్నారు. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహా ఖమ్మంలో ఉన్న మంత్రులు న్యాయం చేయాలన్నారు.
ఆ చిన్నారి పేరు మీద రూ. 25 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు.#TRS
