
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ,
విజయవాడ నుంచి వెళ్లే రైలుకు అమ్మవారి పేరు పెట్టాలని నేను పంపిన ప్రతిపాదనకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించడం సంతోషకరం.
దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ DRM గారు లేఖ ద్వారా తెలియజేశారు.
విజయవాడ వాసుల చిరకాల ఆకాంక్షను, మనోభావాలను గుర్తించినందుకు రైల్వే అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
