అమెరికాలో ఘోర కాల్పులు – 8 మంది చిన్నారులు దుర్మరణం 

అమెరికాలో ఘోర కాల్పులు – 8 మంది చిన్నారులు దుర్మరణం 

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. రద్దీ ప్రదేశంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతిచెందిన చిన్నారుల వయసు ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడు ఘటన అనంతరం పారిపోవడానికి ప్రయత్నించగా, అతడిని పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు కూడా మృతి చెందినట్లు సమాచారం.

కాల్పులకు గురైన చిన్నారుల్లో కొందరు నిందితుడికి బంధువులేనని ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 _Islavath Ramesh 

 State Bureau,  Ashwathama News

5 thoughts on “అమెరికాలో ఘోర కాల్పులు – 8 మంది చిన్నారులు దుర్మరణం ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *