💥💥💥*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు.* *తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ….*💥💥💥

1000394429

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు.* *తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ….*

🔹వచ్చే నెల లోపు ఫీజు నియంత్రణ చట్టం చేయాలి

🔹జూన్ 2 లోగా ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి లేదంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు

1000394430

🔹జూన్ 2 లోగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అమరుల స్థూపాన్ని ఆవిష్కరించాలి లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేమే స్థూపాన్ని ఆవిష్కరిస్తాం

🔹టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మేమిచ్చిన పాంచజన్యం హామీలను అమలు చేస్తాం

1000394435

🔹తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పుట్టిందే తెలంగాణ రక్షణ సేన పార్టీ

🔹నిన్నటి నుంచి మన జెండా పండుగ కార్యక్రమం ప్రారంభమైంది.

🔹కుత్బుల్లాపూర్ లోఇవ్వాళ మన జెండాను ఎగురవేసుకున్నాం.

🔹ఈ నియోజకవర్గం నుంచే మన ఎమ్మెల్యే ల కౌంట్ ప్రారంభమవుతుంది.

1000394431

🔹కచ్చితంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎన్నికవుతారు.

🔹జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అన్ని డివిజన్లలో మన పార్టీ అభ్యర్థులను నిలబెడతాం.

🔹కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లో తెలంగాణ అమరుల స్థూపం నిర్మించి 20 ఏళ్లు అవుతోంది.

🔹ఇప్పటి వరకు కూడా ఆ స్థూపాన్ని ఆవిష్కరించకపోవటం బాధాకరం.

1000394436

🔹తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్లను గెలిపించినప్పటికీ అమరుల స్థూపంపై నిర్లక్ష్యం వహించారు.

🔹జూన్ 2 లోగా అమరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.

🔹లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అమరుల స్థూపాన్ని మేమే ఆవిష్కరిస్తాం.

1000394434

🔹తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కాపాడేందుకు పుట్టింది.

🔹మన జెండాలో ఉండే పసుపు రంగు సౌభాగ్యానికి సూచిక.

🔹పసుపు అంటే మన తంగేడు పువ్వు రంగు.

🔹ఆదివాసీ, బీసీ, మల్లన్న, ఎల్మమ్మ బండారి రంగు. 🔹మన జెండాలోని మరొక రంగు నీలి రంగు.

1000394436

🔹నీలి రంగు కూలీ, నాలీ చేసే వాళ్లు, ఎస్సీ, ఎస్టీ, మా ఆడబిడ్డల రంగు.

🔹నీలి, పీలి కాంత్రి అని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

🔹అందరికీ న్యాయం చేయాలంటే నీలి, పీలి ఉద్యమం రావాల్సి ఉంది.

🔹మరొక రంగు పచ్చ రంగు. అంటే మైనార్టీలు, పర్యావరణానికి సూచిక.

🔹ఇవ్వాళ కుత్బుల్లాపూర్ లో అహ్మద్ గారి టీఆర్ఎస్ లో చేరి మా పార్టీకి మరింత బలాన్ని ఇచ్చారు.

🔹తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం మనమంతా సైన్యం మాదిరిగా పనిచేద్దాం.

🔹జూన్ లో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానురీతిగా ఫీజులు పెంచుతున్నాయి.

🔹ఫీజు నియంత్రణ చట్టం తేవాలని ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం.

🔹వచ్చే నెల లోపు ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పెంచకుండా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

🔹ఇక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు చాలా హామీలు ఇచ్చారు.

🔹కేకే కమిటీ పేరుతో మీరు వేసిన కమిటీక ఉత్తదే. కాలయాపన కోసం ఆ కమిటీ వేశారు.

🔹తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

🔹వారికి ఇస్తామన్న పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులను జూన్ 2 రోజే ప్రకటించాలి.

🔹లేదంటే ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నా.

🔹తెలంగాణ రక్షణ సమితి పాంచజన్యంలో ప్రధానమైనది ఉచిత విద్య, వైద్యం.

🔹విద్య, వైద్యానికి చేసే ఖర్చుతో తెలంగాణ ప్రజల ఇళ్లు గల్ల అవుతున్నాయి.

🔹మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందిస్తాం.

🔹ఎలాంటి జబ్బైనా సరే, ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న సరే వైద్యం ఫ్రీ గా అందిస్తాం.

🔹నేను మీ బిడ్డను. మీ పై ఒక్క పైసా భారం కూడా పడకుండా పాలన చేస్తాను.

🔹తెలంగాణ తెచ్చుకున్నదే మన దుఖం దూరం చేసుకోవటానికి. కానీ దురదృష్టవశాత్తు అది ఇప్పటికీ జరగలేదు.

🔹తెలంగాణ ప్రజల దుఖం దూరం చేయటమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం.

🔹ఇవ్వాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు.

🔹కొనుగోళ్లు కేంద్రాలు లేవు, గన్నీ బ్యాగులు ఇవ్వటం లేదు.

🔹ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోవటంతో రైతులు ధాన్యం కుప్పలపైనే చనిపోతున్న సంఘటనలు చూస్తున్నాం.

🔹సన్న వడ్ల విషయంలో ఈ ప్రభుత్వం దొంగ బుద్ది చూపిస్తోంది.

🔹రైతులు తెచ్చిన ధాన్యంలో పదిశాతం మాత్రమే సన్న వడ్లు అని రాస్తున్నారు.

🔹సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు గ్రేడ్ బీ అని రాసున్నారు.

🔹రైతులను ఆగం చేస్తున్న దుర్మార్గ, కర్కోటక ప్రభుత్వం ఇది.

🔹రైతుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉద్యమిస్తుంది.

🔹ఇక యువత కు లోన్లు ఇచ్చే విషయంలో మా ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది.

🔹మన యువతను నమ్మి వారు వ్యాపారం చేస్తామంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం.

🔹ఉద్యోగాలు కావాలనుకునే యువత కోసం ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తాం.

🔹యువత కలలు తీర్చే విధంగా మా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది.

🔹సామాజిక న్యాయ తెలంగాణ కావాలని మనం అనుకున్నాం. కానీ అది కాలేదు.

🔹రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు.

🔹వారందరికీ న్యాయం జరిగేలా సామాజిక న్యాయ తెలంగాణ కోసం పనిచేస్తాం.

🔹పాంచజన్యం అంటే కృష్ణుడి చేతిలో ఉండే శంఖం. అంటే ధర్మం ఎటు వైపు ఉంటో మేము అటు వైపే ఉంటాం

🔹మైనార్టీలలో ఉన్న ప్రతి మతానికి తెలంగాణ రక్షణ సేనలో ప్రత్యేక శాఖ ఉంది.

🔹సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరి బాగు కోసం మన పార్టీ పనిచేస్తుంది.#TRS

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *