💥💥💥వీధి శునకాలపై సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు :💥💥💥

వీధి శునకాలపై సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు :. ••••••••••••••••••••••••••••••••••.

19.5.2026 తేదీన భారత సర్వోన్నత న్యాయస్థానం వీధి శునకాలపై తుదితీర్పును వెలువరించింది.

బహిరంగ ప్రదేశాల నుండి వీధి శునకాల తరలింపు కొనసాగించ వలసిందే అని , నిధుల కొరత , ఇతర కారణాలు చూపి తరలింపును ఆపడానికి వీలులేదని కూడా తేల్చి చెప్పింది.

అలాగే తమ ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చ రించింది.

ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించు కోవాలని జంతు ప్రేమికుల విజ్ఞప్తులను దేశ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టీస్ సూర్యకాంత్ , జస్టీస్ దీపాంకర్ దత్తా లు కొట్టివేస్తూ తుదితీర్పు వెలువరించడంతో జంతు ప్రేమికులకు షాక్ తగిలింది.

వీధి శునకాల దాడుల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్న విషయం అందరికీ తెలిసినదే.

రాజ్యంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడు కుల , మతాలకు అతీతంగా స్వేచ్ఛగా ఎక్కడైనా సంచరించే , జీవించే అవకాశం ఉండాలే తప్ప , భయంతో కాదని న్యాయస్థానం అభిప్రాయ పడింది.

మొదట దీనిపై 2025 నవంబర్ 7 న కఠిన ఆదేశాలు జారీచేసింది.

ఆసుపత్రులు , పాఠశాలలు , కళాశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రయోజన స్థలాల్లో నుండి వీధి శునకాలను పట్టుకుని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది.

వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు , ఇతర వాక్సిన్లు చేయించి తరువాత వాటిని తిరిగి అవే స్థలాల్లో విడిచి పెట్టరాదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అయితే ఈ కఠిన మార్గ దర్శకాలను సవరించాలని జంతు సంక్షేమ సంఘాలు , డాగ్ ఫీడర్స్ సంఘాలు దేశవ్యాప్తంగా పిటిషన్లు వేసాయి.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 కు విరుద్ధంగా ఉన్నాయని కూడా వాదించారు.

ఈ నియమాల ప్రకారం శునకాలు స్టెరిలైజేషన్ , వాక్సిన్లు వేసి తిరిగి వాటి మాతృ స్థలాలకు తరలించాలని కోరడం జరిగింది.

అయితే ఈ పిటిషన్స్ ను పరిశీలించిన జస్టీస్ విక్రమ్ నాధ్, సందీప్ మెహతా , ఎన్. వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వాదనలతో ఏకీభవించక , తమ ఆదేశాలను వెనక్కు తీసుకునేది కూడా లేదని తేల్చి చెప్పారు.

తాజా విచారణలో ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వాల తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పు బట్టింది. చిన్న పిల్లలు , వృద్దులు, విదేశీ పర్యాటకులపై వీధి శునకాల దాడులను , మరణాలను ప్రస్తావించింది.

తాము ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా శునకాల గాట్లు , దాడులు సంఘటనలు యథేచ్ఛగా జరుగుతుండడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘

సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ అనే డార్వినియన్ సూత్రం వాస్తవంగా అమలవుతున్నట్లు న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

( అంటే బలవంతమైన జీవులు జీవించడం , మిగిలినవి నశించడం , అంటే ఇక్కడ బలవంతుడు శునకాలు , అవి బతికి మానవులు నశించడం అనే అర్ధం వస్తుంది )

వీధి శునకాల వల్ల కలిగే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదని న్యాయస్థానం హెచ్చరించింది. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన భాద్యత ప్రభుత్వాలదని , అందుకు తగిన చర్యలు వెంటనే అమలు చెయ్యాలని కూడా ఆదేశించింది.

కావున తమ విధి విధానాలకు ఖచ్చితంగా అమలు చేయ వలసిందే అని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

నిర్దేశించిన ప్రాంతాలలోనే జంతు ప్రేమికులు వాటికి ఆహారాన్ని అందించాలని స్పష్టం చేసింది .

వీధుల్లో శునకాలు కనిపించడానికి వీలులేదు. రేబిస్ సోకిన పిచ్చి కుక్కలను యుథనేషియా ఇచ్చి సంహరించండి .

ప్రమాదకర శునకాలను సహించవద్దు. ప్రతి జిల్లాలో నియంత్రణ యాంత్రాoగం ఉండి తీరాలి .

ఇదొక సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ . శునకాలను పట్టుకునే ప్రభుత్వ సహాయకులపై కేసులు నమోదు చేయరాదని పోలీసు శాఖను ఆదేశించింది.

బహిరంగ ప్రదేశాల్లో శునకాలకు ఆహారం అందించరాదని కూడా ఆదేశించింది.

అధికారులను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు వుంటాయని కూడా హెచ్చరించింది.

అలాగే మా ఆదేశాలు పాటించని అధికారులు కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం కఠిన తీర్పును వెలువరించింది. ••••••••••••••••••••••••••••••••••. వి. యల్. ప్రసాద్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *