💥💥💥వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి💥💥💥

1000392722

▶️వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

▶️ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

▶️రైస్ మిల్లర్లు, లారీ యజమానులు ప్రభుత్వానికి సహకరించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

✅కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

✅ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన సూచనలు చేశారని తెలిపారు.

1000392723

✅జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా మొత్తం అధికార యంత్రాంగం కృషి చేస్తోందని, అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 314 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినట్లు వెల్లడించారు.

✅ఇప్పటివరకు జిల్లాలో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, మిగిలిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి 63 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని, రైతుల ఖాతాల్లో బ్యాంకుల ద్వారా రూ.237.39 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

1000392724

✅ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లా అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోందని, రైస్ మిల్లర్లు, లారీ యజమానులు కూడా బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ధాన్యం రవాణాకు అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని సూచించారు.

✅కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చి రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు రాకూడదన్నారు. హమాలీల కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

✅పీఏసీఎస్ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటూ, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

✅రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *