💥💥💥ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలీకాన్ఫరెన్స్ప్రజా💥💥💥

1000392321

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలీకాన్ఫరెన్స్ప్రజా

పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

మే 18 నుండి 23 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణపై స్పెషల్ సిఎస్ లు జయేష్ రంజన్, వాణి ప్రసాద్ లతో కలసి శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు

. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తి, దేహదారుఢ్యం, సామాజిక చైతన్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకై ఈ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు.

అదేవిధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించాలని, పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రధానంగా స్పోర్ట్స్ కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిర్వహించాలన్నారు.

ప్రతీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువజన సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు.

ఈనెల 18న నిర్వహించే ‘ఫిట్- తెలంగాణా థీమ్ తో రాష్ట్ర , జిల్లా కేంద్రాలలో 5K రన్, అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో వ్వాకథాన్, యోగ తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని,

దీనిలో భాగంగా ఈ వారం రోజులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియంలలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష: అదేవిధంగా జిల్లాల్లో కొనసాగుతున్నధాన్యం కొనుగోళ్లపై కూడా జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడ జాప్యం లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *