💥💥💥నీట్‌’ను పూర్తిగా రద్దు చేయండి.. ఇంటర్ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లివ్వండి’: కేంద్రానికి సీఎం విజయ్ లేఖ💥💥💥

1000391063

మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం ముందే లీకైందనే విషయం వెలుగులోకి రావడంతో.. కేంద్రం ఈ పరీక్షను రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా దీనిపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. కేంద్రానికి నేరుగా ఆయన రాసిన లేఖలో.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు ఇవ్వారని డిమాండ్ చేశారు. ఈ బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని అన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

TN CM Joseph Vijay NEET Letter : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం, పరీక్ష రద్దు వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల వల్ల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి నీట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్షను కేంద్రం రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇంటర్ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు ఇవ్వాలని కోరతూ బుధవారం కేంద్ర ప్రభుత్వానికి ఓలేఖ రాశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.💥💥💥💥

లక్షలాది మంది విద్యార్థుల ఆశలు గాల్లోనే..ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం విజయ్ స్పందిస్తూ.. “కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా డాక్టర్ కావాలని కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థుల ఆశలను, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని పూర్తిగా ముక్కలు చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఇలాంటి పరీక్షల విధానంలో ఎంతటి లోపాలు, నిర్మాణాత్మక వైఫల్యాలు ఉన్నాయో చెప్పడానికి ఈ రద్దు నిర్ణయమే నిదర్శనం” అని లేఖలో పేర్కొన్నారు💥💥💥💥

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా 5,432 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించగా.. తమిళనాడులోని 31 నగరాల్లో దాదాపు 1.4 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఇప్పుడు పరీక్ష రద్దు కావడంతో ఈ విద్యార్థులంతా తీవ్ర గందరగోళంలో పడిపోయారని సీఎం గుర్తు చేశారు.💥💥💥💥

పాత లోపాలను గుర్తుచేసిన సీఎంగతంలో జరిగిన అక్రమాలను కూడా విజయ్ తన లేఖలో ప్రస్తావించారు. 2024లో జరిగిన పేపర్ లీకేజీ కేసులో ఆరు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదై, ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ.. పరీక్షల సంస్కరణల కోసం ఏకంగా 95 సిఫార్సులను సమర్పించాల్సి వచ్చిందంటేనే ఈ వ్యవస్థ ఎంతలా దెబ్బతిందో అర్థమవుతోందని ఆయన విమర్శించారు.💥💥

రాష్ట్రాల కోటా హక్కులు ఇవ్వాల్సిందే!తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి నీట్‌ను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసిన సీఎం విజయ్.. కేంద్రం ముందు తమ డిమాండ్లను స్పష్టం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా పక్కనబెట్టి.. క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు పూర్తి అనుమతి ఇవ్వాలని అన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లోని స్టేట్ కోటా సీట్ల భర్తీ హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలన్నారు💥💥💥💥

నీట్ లాంటి కేంద్ర కేంద్రీకృత పరీక్షల వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు, తమిళ మీడియం విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవాలని సీఎం విజయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 💥💥

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *